భూమి రాణి
భూమి చలాకి పిల్లలా గుండ్రంగా తిరుగుతూ రాత్రి పగలు ఆడుకుంటోంది ! నిద్ర మాట ఎరుగదు !! వర్షంలో నానుతూ నానుతూ పచ్చపచ్చగా సింగారించుకొని భూమి పూలు పూలుగా భ్రమణం !
భూమి చలాకి పిల్లలా గుండ్రంగా తిరుగుతూ
రాత్రి పగలు ఆడుకుంటోంది !
నిద్ర మాట ఎరుగదు !!
వర్షంలో నానుతూ నానుతూ
పచ్చపచ్చగా సింగారించుకొని
భూమి పూలు పూలుగా భ్రమణం !
ఏ దేవుణ్ణి కొలుస్తుందో ఏ వ్రతమో
ఎప్పుడూ ఆత్మ ప్రదక్షిణే! ఆగేదే లేదు
ఆకాశం ఇచ్చిన ఇంద్రధనుస్సు పృథ్వికి కానుకగా
ఏడు వర్ణ వర్ణాల నగ !
మంచు తెరవేసుకుని సుస్పష్టంగా
ఎంత అందమో భూమి రాణిది !
అన్ని ఋతువులతో మమేకమై భూమి ఫలాలతో
ద్విగుణీకృత సౌందర్య ధామం !
ఇవన్నీ భూమి రాణి ఏం చేసుకుంటుంది
అందరికీ పంచేస్తుంది
ఏ దేశంలోని వారైనా భూమి తల్లికి
అందరూ బిడ్డలే !
భూమి తల్లిది ఏ మతమూ కాదు !
అసలు అందరికి ఇలవేలుపు భూమే కదా !
గాలి అగ్ని నీరుతో భూమి గనులు గనులుగా
కల్పతరువు అక్షయ పాత్ర !
ఎంత బరువైనా భూమాతకు మోయడమే ఆనందం !
తల్లి కదా ! ఎప్పుడూ తల్లడిల్లదు !!
– కందాళై రాఘవాచార్య 87905 93638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

