శిక్ష
తడిలేని అవని దేహం నిండా పగుళ్ల గాయాల నొప్పులు.. పొడిబారిన మట్టి ఉసూరుమంటూ గంతులేస్తోంది గాలితో అక్కడక్కడా రాలిన ఆకుల తోడుకూడా తీసుకొని..
తడిలేని అవని దేహం నిండా
పగుళ్ల గాయాల నొప్పులు..
పొడిబారిన మట్టి ఉసూరుమంటూ
గంతులేస్తోంది గాలితో
అక్కడక్కడా రాలిన
ఆకుల తోడుకూడా తీసుకొని..
పెళుసు వారిన కొమ్మల్లో పచ్చదనం
లోలోపల మినుకుమంటోంది ఆశగా
రెక్కలు తడిమిన జ్ఞాపకాల ఊపిరితో…
నీడలు పారిపోతున్నాయి ఎక్కడికో
నిప్పుల కొలిమిలో ఉండలేక..
కారుమబ్బుల జాడలు అపుడపుడూ
ఊరిస్తూ విడివడుతున్నాయి..
ఏ చినుకు రాలినా,
అమాంతం తనలో ఒంపుకునేందుకు
వెర్రిచూపులు చూస్తున్న నేల..
అణువణువూ తనది చేసుకుంటూ
మనిషి చేసిన నేరానికి
శిక్ష ఇదేనని తీర్పునిస్తూ
సాగుతూనే ఉన్నాడు భానుడు
అలుపు లేక…!!
– అరుణ ధూళిపాళ 87123 42323
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

