కొత్త ఏటి గడ్పల ఉన్న వేళ
కండ్లు మూస్కోని ఈ దశాబ్దపు గల్మలకు వోదమా..?
నాటి ఉద్యమ ఉద్విగ్న కాలరేఖ శిఖరం
అంచున నిలవడి అటూఇటూ జూద్దమా..?
తమ్మీ…!
అటుకెయ్ జూసి సిన్నవొయిన కండ్లు
ఇటని దిప్పితె పెద్దయి గాకుంటె నా మీదొట్టు.
ఏమున్నయనటు..?
నెత్తుటి నెర్రెలిచ్చి మొగులు ముకమైన
పడావు పంటబూముల కండ్లు
కబ్జాకోరు కొలతరాల్ల
పాదాల కింద పాతాలంబొయిన సెర్లు
బట్టలారెయ్య దండాలైన కరంటు వైర్లు
నోర్లెండి తుప్పు నములుతున్న బోర్లు మోటర్లు
సాగుకంటె సావు నయమన్న ఎవుసపు తరీక
బతికి బలుసాకు తినుమనే వలసల పోక
ఉరికొయ్యలుగ మారిన మోళ్లు
వల్లకాడులై పొయిన పల్లెటూర్లు
పత్తిని జంపిన పురుగులు
మిత్తికి జచ్చిన రైతులు
ఇటని జూడు…. భూములు పచ్చ బంగారాలు
అలుగులు పారే చెర్లు నిండు గంగాళాలు
కరెంటు పోవుడు కలల మాట
బొంబాయి దుబాయి పొయిన తమ్ముల ముచ్చట్ల ఊరిబాట
రైతు బంధువైన రాజ్యం
కష్టాలు కన్నీళ్లు పూజ్యం
హరిత హారాలైన చెట్లు
రాజు లౌతున్న రైతులు
ఎన్ని చెప్పినా ఒకటి తక్వనె!
దేశం పట్టాల్సింది తెలంగాణ తొవ్వనె!!
– మడిపల్లి రాజ్‌కుమార్, 99496 99215