ద్విజిహ్వాః క్రూర కర్మాణో
అనిష్టా శ్చిద్రాను సారిణః
దూర తోపిహి పశ్యంతి
రాజానో భుజగా ఇవ
ఎవరి ముందు వారికి అనుకూలంగా మాట్లాడుతూ, క్రూర కర్మములాచరిస్తూ కొందరు అవకాశవాదంతో వ్యవహరిస్తుంటారు. ఇతరుల్లో తప్పులను మాత్రమే వెతకటానికి రంధ్రాన్వేషణ చేస్తూ, పరుల మేలు ఓర్వనివారిని వారు ఎంతటి వారైనను దూరంగా ఉంచాలి. అలాంటి వారితో ఎల్లప్పుడూ ఏదో రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది.