వచస్తత్ర ప్రయోక్తవ్యం/ యత్రోక్తం లభతే ఫలమ్
స్థాయీ భవతి చాత్యన్తం/ రాగః శుక్ల-పటే యథా॥
తెల్లని బట్టకు రంగులద్దితే.. మిక్కిలి ప్రకాశవంతంగా మెరుస్తూ, ఆ రంగులు నిలుస్తాయి. అట్లే.. మనం చెప్పదలచుకొన్న మాట, చెప్పవలసిన సమయంలో చెప్పినట్లయితే, మనం ఆశించిన ఫలితాన్ని పొందగలం. అంటే.. చెప్పాలనుకున్న విషయంతో పాటు, చెప్పే సందర్భమూ ప్రధానమే.