ఉత్సవే వ్యసనే చైవ
దుర్భిక్షే రాష్ట్ర విప్లవే
రాజ ద్వారే శ్మశానేచ
యాస్తిష్ఠతి సబాంధవః
గొప్పగా పండుగలు చేసుకొంటున్న సమయంలో, రాజాశ్రయం పొంది సుఖాలను అనుభవిస్తున్నప్పుడు.. మేం బంధువులమంటూ అందరూ వస్తారు. కానీ… కరువు కాటకాలు వచ్చినప్పుడు, దేశం అలజడులకు లోనై ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు, వ్యసనాలకు లోనై కష్టాలు పడుతున్న సమయంలో, అదృష్టం తారుమారై శ్మశానంలో కష్టాలను అనుభవిస్తున్నప్పుడు మనకు తోడుగా ఉండేవాడే నిజమైన బంధువు. సుఖాలే కాదు, కష్టాల్లోనూ చేయందించి సాయంగా నిలిచే వాడే ఆత్మబంధువు.