మార్కెట్లో దొరికే కూరగాయలు, ఆకుకూరలపై క్రిమిసంహారక మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంత శుభ్రం చేసినా.. కొన్నిసార్లు అలాగే ఉండిపోతుంటాయి.
మార్కెట్లో దొరికే కూరగాయలు, ఆకుకూరలపై క్రిమిసంహారక మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంత శుభ్రం చేసినా.. కొన్నిసార్లు అలాగే ఉండిపోతుంటాయి. అలాంటప్పుడు.. వెనిగర్ కలిపిన నీటితో కూరగాయలు, ఆకుకూరలను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొత్తిమీర, పుదీనాను వెనిగర్ కలిపిన నీటిలో నానబెడితే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
వంటలకు పులుపు కావాలంటే.. కొద్దిగా వెనిగర్‌ను వాడుకోవచ్చు. దీనివల్ల వంట రుచి తగ్గకుండా ఉంటుంది. ముఖ్యంగా సలాడ్లు, గ్రేవీ వంటకాల్లో వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది.
మాంసం మెత్తగా ఉడకాలంటే.. వెనిగర్‌ను వాడాల్సిందే. మాంసానికి కొద్దిగా వెనిగర్ రాయడం వల్ల ముక్కలు మెత్తబడుతాయి. త్వరగా ఉడుకుతాయి. అంతేకాదు.. మాంసంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, కొవ్వును తొలగించడంలోనూ వెనిగర్ సాయపడుతుంది. వెనిగర్‌తో మాంసం రుచి కూడా పెరుగుతుంది.
కేవలం వంటలకు మాత్రమే కాదు.. వంటింటిని శుభ్రం చేయడంలోనూ వెనిగర్ ముందుంటుంది. కూరగాయలు తరిగే బోర్డ్డ్, స్టీల్ పాత్రలు, గాజు వస్తువుల మీది మరకలు, దుమ్ము, నూనె జిడ్డును తొలగించడంలో వెనిగర్ సమర్థంగా పనిచేస్తుంది. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి.. ఆయా వస్తువులను తుడిస్తే తళతళా మెరిసిపోతాయి. వెనిగర్‌ను సరిగ్గా వాడితే.. వంట పనులు వేగంగా పూర్తవుతాయి.