Curd With Jaggery | పెరుగును మనం రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. భోజనం చివర్లో పెరుగును తినకపోతే చాలా మందికి భోజనం చేసిన సంతృప్తి ఉండదు. అలాగే బెల్లాన్ని కూడా మనం వాడుతూనే ఉంటాం. దీన్ని తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పెరుగులో బెల్లం కలిపి తింటే అనేక లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ మిశ్రమం అత్యంత ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుందని అంటున్నారు. కనుక దీన్ని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు. పెరుగులో బెల్లం కలిపి తింటే ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. మలబద్దకం ఉన్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
పెరుగులో బెల్లం కలిపి తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. బెల్లంలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట ఉండవు. ఉత్సాహంగా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. చురుకుదనం వస్తుంది. బద్దకం పోతుంది. పెరుగులో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని తినవచ్చు.
ఈ మిశ్రమంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల క్యాల్షియం కూడా అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక రకాల బి విటమిన్లు సైతం ఈ మిశ్రమం ద్వారా మనకు లభిస్తాయి. పెరుగు శరీరానికి చల్లదనం అందిస్తుంది. కనుక ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలో ఉండే వేడి పోతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. కొందరికి సీజన్లతో సంబంధం లేకుండా శరీరంలో వేడి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని తింటుంటే ఫలితం ఉంటుంది.
పెరుగులో బెల్లం కలిపి తినడం వల్ల లివర్, రక్తం శుద్ధి అవుతాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఈ మిశ్రమం వల్ల జీర్ణ వ్యవస్థ సైతం శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో బెల్లం కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఈ మిశ్రమం ఆరోగ్యకరమే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దీన్ని తినకూడదు. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు, విరేచనాలు అవుతున్నవారు, అలర్జీలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తినకపోవడమే మంచిది. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ పెరుగు, బెల్లం మిశ్రమాన్ని తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.