HomeLifestyleUsing Baking Soda For Weed Control Certain Precautions Should Be Taken
కలుపు నివారణలో బేకింగ్
కలుపు మొక్కలను నియంత్రించడంలో బేకింగ్ సోడా సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా, పెరటి తోటల్లో పెరిగే చిన్న కలుపు మొక్కలను ఇది సహజసిద్ధమైన పద్ధతుల్లోనే తొలగిస్తుంది.
కలుపు మొక్కలను నియంత్రించడంలో బేకింగ్ సోడా సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా, పెరటి తోటల్లో పెరిగే చిన్న కలుపు మొక్కలను ఇది సహజసిద్ధమైన పద్ధతుల్లోనే తొలగిస్తుంది. అయితే, బేకింగ్ సోడా వాడటానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కలుపు మొక్కలను కొద్దిగా తడిపి, వాటి ఆకులపై, మొదళ్లలో బేకింగ్ సోడాను చల్లాలి. వాతావరణం పొడిగా ఉన్న సమయంలో ఈ పద్ధతిని పాటించవచ్చు.
ఒక లీటర్ నీటిలో ఒక కప్పు బేకింగ్ సోడాను కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపి.. కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి.
బేకింగ్ సోడా వల్ల తోటలోని ఇతర మొక్కలకూ హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.
మబ్బులు పట్టిన సమయంలో కన్నా.. ఎండగా ఉన్న రోజుల్లోనే బేకింగ్ సోడా మంచి ఫలితాలు ఇస్తుంది.
కలుపు మొక్కలను బేకింగ్ సోడా పూర్తిగా చంపేయదు. కాబట్టి, మొక్కలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.