Silver Purse | వెండి పర్సు వారెవ్వా..!
Silver Purse | పెళ్లికి ముస్తాబవ్వాలంటే ఇప్పటిదాకా బొట్టుబిళ్ల వారెవ్వా... ముక్కుపుడక వారెవ్వా... అనిపిస్తే చాలనుకున్నాం. కానీ ఇప్పుడు వెండిపర్సు వారెవ్వా... దాని మెరుపు వారెవ్వా... అనేట్టు కూడా ఆలోచించాలేమో! ఎందుకంటే, వేడుక అలంకరణకు దీటుగా వెండితో పర్సులు రూపొందుతున్నాయి.
Silver Purse | పెళ్లికి ముస్తాబవ్వాలంటే ఇప్పటిదాకా బొట్టుబిళ్ల వారెవ్వా… ముక్కుపుడక వారెవ్వా… అనిపిస్తే చాలనుకున్నాం. కానీ ఇప్పుడు వెండిపర్సు వారెవ్వా… దాని మెరుపు వారెవ్వా… అనేట్టు కూడా ఆలోచించాలేమో! ఎందుకంటే, వేడుక అలంకరణకు దీటుగా వెండితో పర్సులు రూపొందుతున్నాయి. ఆభరణాల తరహాలోనే అందమైన నగిషీలతో వస్తున్నాయి. బంగారు పూతనూ పూసుకుని ఆహార్యానికి రాజసాన్ని తెచ్చిపెడుతున్నాయి.

పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఇతర వేడుకలప్పుడు ఎంత అందంగా అలంకరించుకుంటామో, దానికి నప్పేలా చేతిలో పర్సో, హ్యాండ్బ్యాగో ఉండేలానూ చూసుకుంటాం. అందుకే అచ్చమైన లెదర్ బ్యాగులతోపాటు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవీ, పూసలూ రాళ్లూ ఉన్నవీ… ఇలా రకరకాలు తయారవుతున్నాయి. ఇక, ఇప్పుడు ప్రత్యేక సందర్భాల్లో ధరించే నగలకు దీటుగా వెండి పర్సులు రూపొందుతున్నాయి. స్వచ్ఛమైన వెండితో చేసిన వీటిని సిల్వర్ పర్స్ లేదా క్లచ్గా పిలుస్తున్నారు.

సాధారణ పర్సుల్లాగే గుండ్రంగా, చతురస్రంగా, దీర్ఘచతురస్రంగా… విభిన్న ఆకృతుల్లో వస్తున్నాయి. వీటిమీద పూలూ, తీగలు, దేవతా ప్రతిమలు అందంగా చెక్కుతున్నారు. పచ్చలూ కెంపులూ, రంగురంగుల రత్నాలను పొదుగుతున్నారు. మీనాకారీ తరహా నగిషీలూ అద్దుతున్నారు. మువ్వలు, ముత్యాలను అలంకరణలో జత చేస్తున్నారు. మొత్తంగా చూడచక్కని ఆభరణంలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, బంగారు పూత కూడా పూస్తున్నారు. పసిడి వన్నెల్లో వెలుగులీనే వీటిని చూస్తే నిజమైన బంగారు పర్సేనేమో అనే భ్రమ కలగకమానదు. రాజుల ఆభరణాల తరహాలో చూడగానే అబ్బురపరిచేలా ఉంటున్నాయివి. వివిధ నగల తయారీ సంస్థలతోపాటు ఆన్లైన్లోనూ ఇవి దొరుకుతున్నాయి. సైజును బట్టి పాతిక వేలు మొదలు లక్ష దాకా ధర పలుకుతున్నాయి. మొత్తానికి… పట్టుచీర కట్టుకుని, ఈ పసిడి వన్నెల పర్సును పట్టుకుంటే… సిరుల తల్లి శ్రీమహాలక్ష్మి కొత్త అవతారంలా కనిపించరూ?
Read More :
“Sandals with Metal Accent | పాదాలకే కాదు చెప్పులకు కూడా నగలు వచ్చేశాయి!!”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- fashion
- Silver Purse
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

