నడిరేయి ఏ జామునో నిజాముల నగలు ధరించి.. తారామతి బారాదరి దరిదాపుల్లో అష్టపదులు పాడుతూ ఇష్టసఖి దర్శనమిస్తే? మనం.. సుల్తాన్ కులీ అయిపోయింత ఖుషీ! ఆమె.. మతిపోగొట్టేంత సౌందర్యరాశి భాగమతి! కొన్ని నగలు మధుపాత్ర లాంటివి. భావుకతను తట్టిలేపుతాయి.
ఫొటోలోని మాడల్ ధరించిన నిజాం జువెలరీకి కూడా ఆ మత్తు, మహత్తు ఉన్నాయి.