ప్రేమకు వెల కట్టలేం. కానీ, విలువైన వస్తువు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు అన్నాడో ప్రేమకవి. ఈ మాటను దృష్టిలో ఉంచుకొని లగ్జరీ యాక్సెసరీస్ తయారుచేసే డా మిలానో బ్రాండ్ ప్రేమికుల రోజుకు అతివల కోసం కొత్త కలెక్షన్‌ను విడుదల చేసింది. నాణ్యమైన లెదర్‌తో తయారుచేసిన ఈ లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్‌లో హాట్ టాపిక్.
ఈ లేటెస్ట్ కలెక్షన్లో మినీటోటెలు, బాగెట్లు, హ్యాండ్‌బ్యాగులు, క్రాస్ బాడీ బ్యాగులు, స్లింగ్ బ్యాగులు ఉన్నాయి. ప్రేమను వ్యక్తపరిచేందుకు గానూ.. బ్యాగు మీద లవ్ సింబల్ కూడా డిజైన్ చేశారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ బ్యాగ్ ధర రూ.10,999 మాత్రమే!