ఉద్యోగులను మోసం చేస్తున్న సర్కార్
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలు కోసం ఉద్యోగులు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పరిషారం చూపకుండా చర్చలు, సమావేశాలు, కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
- హామీలు అమలు చేయకుండా చర్చల పేరుతో కాలయాపన : దేవీప్రసాద్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలు కోసం ఉద్యోగులు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పరిషారం చూపకుండా చర్చలు, సమావేశాలు, కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు నివేదిక తెప్పించుకోలేకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని అన్నారు. పీఆర్సీపై చర్చలు కాకుండా నివేదిక తెప్పించి, వెంటనే నిర్ణయం తీసుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని పకనపెట్టి మళ్లీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని దేవీప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు డీఏలు పెండింగ్లో ఉంటే కేవలం రెండు డీఏలను మాత్రమే విడతలవారీగా ఇస్తామనడం ఉద్యోగులను అవమానించడమేనని అన్నారు. ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ శాలరీ, ఇతర బకాయిల చెల్లింపుపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించకపోవడం దారుణమని పేరొన్నారు. ఉద్యోగులు కొత్త వరాలేమీ కోరడం లేదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను మాత్రమే అమలు చేయాలని అడుగుతున్నారని స్పష్టంచేశారు. చర్చలపేరిట మరో ఆరు నెలలు గడుపాలని చూస్తే ఉద్యోగులు ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు పరిషారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని దేవీప్రసాద్ ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

