ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల ప్రభావం.. కారణం ఏదైతేనేం, చిన్న వయసులోనే చాలామందిలో జుట్టు నెరిసిపోతున్నది. నెత్తికి రంగులేసి కవర్ చేయొచ్చు. కానీ, కనుబొమలు కూడా తెల్లగా మారితే!? హార్మోన్ల ప్రభావం, ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఫలితంగా.. ముఖం అందవిహీనంగా మారుతుంది. మరికొందరిలో వయసు పెరిగేకొద్దీ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వెంట్రుకలు తెల్లబడతాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు సౌందర్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.