Tea History | అసలు తేయాకు ఎలా పుట్టింది? చైనా జానపదుల్లో చెప్పే దయ దేవతకు టీకి సంబంధమేంటి?
Tea History | తేనీరులో రకరకాల వెరైటీలు ఉన్నట్టే.. తేయాకు పుట్టుక వెనుక కూడా టీ పరిమళమంత గొప్ప కథలు పుట్టెడు ఉన్నాయి. బుద్ధుడి కనురెప్పల వెంట్రుకల నుంచి టీ మొక్క ఆవిర్భవించిందని కొందరి వాదన. వీటికి భిన్నంగా మరో కథ చైనా జానపదుల్లో వినిపిస్తుంది.
Tea History | తేనీరులో రకరకాల వెరైటీలు ఉన్నట్టే.. తేయాకు పుట్టుక వెనుక కూడా టీ పరిమళమంత గొప్ప కథలు పుట్టెడు ఉన్నాయి. బుద్ధుడి కనురెప్పల వెంట్రుకల నుంచి టీ మొక్క ఆవిర్భవించిందని కొందరి వాదన. వీటికి భిన్నంగా మరో కథ చైనా జానపదుల్లో వినిపిస్తుంది. ‘దయ’ దేవత కరుణతో తేయాకు మొక్కలు పుట్టాయని వాళ్లు బలంగా చెబుతారు. ఈ కథ చైనాలో బోధిసత్వుడి మూలాలను తెలియజేస్తుంది. ఈ గాథకు ఆయన్ను ప్రత్యక్షసాక్షిగా విశ్వసిస్తారు.
చైనాలో ఒకానొక ప్రాంతంలో బోధిసత్వుడి కంచు విగ్రహం ప్రతిష్ఠించి ఉన్న పురాతన ఆలయం ఉండేదట. ఓ నిరుపేద రైతు రోజూ వచ్చి ఆ గుడిని శుభ్రం చేస్తుండేవాడు. అయితే ఒకరోజు ఆకస్మికంగా బోధిసత్వుడి విగ్రహం కదిలిందట. దాన్ని చూడగానే రైతు మోకరిల్లి కండ్లు మూసుకోగా.. దయా దేవి లోగొంతుకతో ‘ఈ గుడి వెలుపల నీ భవిష్యత్తుకు తాళం చెవి ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో’ అని చెప్పిందట. దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న రైతు గుడి బయట వెతకగా ఓ ఎండిపోయిన పొద కనిపించిందట. దానికి పాదుతీసి, రోజూ నీళ్లు పోస్తూ జాగ్రత్తగా సంరక్షించాడు ఆ రైతు. కొన్నాళ్లకు ఆ పొద చివుళ్లు వేసింది. పచ్చగా కళకళలాడింది. ఆ ఆకులు సేకరించి పానీయంగా తాగితే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చిందట. ఆ చెట్టు నుంచే చైనాలో తేయాకు మొక్కలు అంతటా విస్తరించాయని కొందరి నమ్మకం. అలా బోధిసత్వుడి ఆలయ ఆవరణలో తేయాకు ఉనికిలోకి వచ్చింది. ఆ దయ గల దేవత సెలవిచ్చినట్టు కొన్ని పరిస్థితుల్లో ఏమీ పాలుపోకుండా బుర్ర బద్దలవుతున్న వేళ.. చిక్కటి టీ తాగితే చాలు! తేనీటి తాళం చెవి ఆలోచనల గవాక్షం తెరిచి.. మస్తిష్కాన్ని తట్టిలేపుతుంది.
పర్పుల్ టీ
కావలసినవి: వేడి నీళ్లు: రెండు కప్పులు, పర్పుల్ టీ బ్యాగ్: రెండు (తేయాకు, శంఖుపూల మిశ్రమం), తేనె: రెండు టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్: నాలుగు
తయారీ: రెండు కప్పుల్లో వేడినీళ్లు పోసుకోవాలి. పర్పుల్ టీ బ్యాగ్ వేసి మూడు నిమిషాలపాటు ముంచి తీయాలి. తర్వాత తేనె వేసి కలపాలి. టీ చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని జాలీగా తాగేస్తే సరి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా పదికాలాలపాటు యవ్వనంగా కనిపిస్తారు.
టీకా తాత్పర్యం
ఈ ప్రపంచం ఎటు పోయినా నాకు సంబంధం లేదు. సమయానికి తేనీరు సిద్ధంగా ఉంటే చాలు!
ఎఫ్. దోస్తోవ్స్కీ, రష్యన్ తత్వవేత్త
Read More :
Tea Tales | ఆడీ కారులో ఛాయ్ అమ్ముతున్న యువకులు.. త్వరలోనే బెంజ్ కారులో కూడా విక్రయిస్తారట!
Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

