పిల్లి కూతల్లా మొదలవుతుంది. పులి గాండ్రింపు రేంజ్‌కు చేరుకుంటుంది.ఎంత నిద్రలోకి జారుకుంటే అంత సౌండ్. ఈ ముచ్చటంతా గురక గురించే! గురక పెట్టేవారికి ఆపై ఎప్పటికో అనారోగ్య సమస్యలు వస్తాయేమో కానీ, ఆ శబ్దం భరించలేక ఎందరో నిద్రలేమితో బాధపడుతుంటారు. అధిక బరువు గురకకు ఒక కారణంగా చెబుతున్నారు. గురక సాధారణ సమస్యే అయినా.. అది కొందరికి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని నిపుణుల మాట. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు కూడా! చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే గురక నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.