ఏటా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. అందులో చాలావంతు నేలనీ, నీటినీ చేరుతున్నది. నీటిని కలుషితం చేస్తున్న వ్యర్థాలలో 86 శాతం పాపం ప్లాస్టిక్దే. ఇందులో మూడో వంతు ప్యాకేజింగ్ కోసం వాడేసే ప్లాస్టిక్ రేపర్లే కావడం గమనార్హం. ఇందుకు ఓ పరిష్కారం ఉంటే బాగుండు అని ఆలోచించారు ముంబయికి చెందిన నేహా జైన్. తన ఊరి తీరమే ఇందుకు బదులిచ్చింది.
సముద్రంలో పుష్కలంగా దొరికే నాచుతో ప్యాకింగ్ మెటీరియల్ రూపొందించవచ్చనే ఆలోచన వచ్చింది. అందుకు మెరైన్ బయాలజిస్టులు కూడా సహకరించడంతో… సముద్ర నాచు నుంచి ప్యాకింగ్ చేసే ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయగలిగారు. ఇందుకోసం జీరో సర్కిల్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు నేహ. ఖర్చు, శ్రమతో కూడుకున్న నేహ పనికి గత ఏడాది ‘ద టమ్ఫర్డ్ ప్లాస్టిక్ ఇన్నొవేషన్’ ప్రైజ్ దక్కింది. దాని నుంచి వచ్చిన డబ్బుతో కొంత పెట్టుబడి సమకూరింది. ప్రస్తుతం ప్యాకింగ్ వరకే పరిమితమైన తన ఉత్పత్తి ద్వారా మున్ముందు మాస్కులు, పాదరక్షలు కూడా రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు నేహ.