చేపల కన్నా.. ఇవి మిన్న
గుండె పనితీరుని మెరుగ్గా ఉంచడం, నాడీ కణాలకు రక్షణ పొరను నిర్మించడం, రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్, క్యాల్షియం లాంటి వాటిని తీసేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం లేకుండా ఉండాలంటే చేపలు బాగా తినాలని చాలామంది సలహాలిస్తారు.
గుండె పనితీరుని మెరుగ్గా ఉంచడం, నాడీ కణాలకు రక్షణ పొరను నిర్మించడం, రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్, క్యాల్షియం లాంటి వాటిని తీసేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం లేకుండా ఉండాలంటే చేపలు బాగా తినాలని చాలామంది సలహాలిస్తారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేది నిజమే. కానీ, వాటిల్లోనే ఉంటుందని, అధికంగా ఉంటుందనేవి భ్రమలే. వంద గ్రాముల చేపలో 2.5 నుంచి 3 గ్రాములే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
మార్కెట్లో తక్కువ ధరలో ఉండే మెంతి కూర, మునగాకు, అవిసె గింజల్లో అంతకంటే ఎక్కువ మోతాదులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వంద గ్రాముల అవిసె గింజల్లో 22 గ్రాములు, చియా గింజల్లో 17 గ్రాములు, వాల్‌నట్స్‌లో 9 గ్రాముల వరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి చురుకైన మెదడు, గుండె ఆరోగ్యం కోసం చేపలు తింటే మంచిది. తినకపోతే ప్రమాదం అనేది అవాస్తవం. ఏది తిన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం వారానికి రెండు రోజులు తీసుకుంటే మంచిది. చేపలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు అన్నది నిజమే. కానీ, చేపలు తినని వాళ్లకు నష్టమన్నదాంట్లో నిజం లేదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

