వివాహితపై సామూహిక లైంగిక దాడి
వివాహితపై ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన ఫయాజ్‌కు మయన్మార్‌కు చెందిన మహిళతో కొంత కాలం క్రితం వివాహమైంది. ఫయాజ్ దంపతులు కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషన్ దౌలా ప్రాంతంలోని డైమండ్ హోటల్ సమీపంలో నివాసముంటున్నారు.
- ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సైదాబాద్, అక్టోబర్ 27 : వివాహితపై ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన ఫయాజ్‌కు మయన్మార్‌కు చెందిన మహిళతో కొంత కాలం క్రితం వివాహమైంది. ఫయాజ్ దంపతులు కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషన్ దౌలా ప్రాంతంలోని డైమండ్ హోటల్ సమీపంలో నివాసముంటున్నారు. ఫయాజ్ స్నేహితులు మయన్మార్‌కు చెందిన కమల్, ముజీబ్ , రెహ్మన్ అలియాస్ ఇబ్రహీం అదే ప్రాంతంలో నివాసముంటున్నారు. కాగా ఇంటి వద్ద ఫయాజ్ భార్య ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చొరబడి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తమ సమీప బంధువుతో చెప్పింది.
బాధితురాలితో కలిసి వారు కాంచన్‌బాగ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి విచారించి వివరాలను సేకరించారు. బాధితురాలిపై లైంగిక దాడి జరిగినప్పటి నుంచి భర్త ఫయాజ్ పరారీలో ఉండటంతో పోలీసులకు అనుమానం రావడంతో అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

