భయపెడుతున్న ఊబకాయం
చైల్డ్ ఒబేసిటీ (పిల్లల్లో ఊబకాయం).. క్రమంగా పెరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. 1990 నుంచి ఈ సమస్య నాలుగు రెట్లు పెరిగింది. ఐదు నుంచి 19 ఏండ్ల వయసు ఉన్నవారిలో రెండు శాతం నుంచి ఎనిమిది శాతానికి చేరుకున్నది. ఇలా చిన్నారులు ఊబకాయం బారిన పడుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తున్నది. చైల్డ్ ఒబేసిటీ నివారణతోపాటు నిర్మూలన కోసం పలు కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆహారంలో మార్పులు
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, బేకరీ పదార్థాలు, చక్కెర పానీయాలను పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలకు అందించే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
శారీరక శ్రమ
ఐదు నుంచి 19 ఏండ్ల మధ్య వయసు ఉన్న పిల్లలను.. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు ఏదో ఒక శారీరక శ్రమ లేదా ఆరుబయట ఆడే ఆటలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. మొబైల్ ఫోన్లు, ట్యాబ్, టీవీల ముందు గడిపే సమయాన్ని పరిమితం చేయాలి. దీనివల్ల వారిలో నిశ్చల జీవనశైలి తగ్గుతుంది.
సరైన నిద్ర, విశ్రాంతి
పిల్లల్లో నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు అసమతుల్యతకు గురై అతిగా తినే అలవాటు పెరుగుతుంది. కాబట్టి, పిల్లల వయసును బట్టి తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
తల్లిదండ్రులే కీలకం
పెద్దవాళ్లను చూసే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు టీవీలు, మొబైల్స్ చూడటం లాంటి అలవాట్లను మాన్పించాలి. చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ప్రాథమిక దశలోనే జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అరికట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తున్నది. అంతేకాదు.. పదేండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఎలాంటి మందులు, సర్జరీలను ఆశ్రయించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ఒకవేళ హార్మోన్ల సమస్యల వల్ల బరువు పెరిగితే.. వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు