చాలా మందికి టైమ్ మేనేజ్మెంట్ విషయంలో సమస్య ఉంటుంది. ఒక రోజుకు 24 గంటలు సరిపోవడం లేదనిపిస్తుంది. దానికి రెండు కారణాలు. ఒకటి, వాయిదా వేసే అలవాటు. రెండు, పర్ఫెక్షన్ పిచ్చి. సమయానికి చేయకపోవడం ఎంత ఇబ్బందో, అనవసరమైన విషయాలను మరీ సునిశితంగా చూస్తూ సమయం గడపడమూ అంతే సమస్య. అందుకే ఉన్న సమయాన్ని చక్కగా వాడుకుంటూ సులభంగా పనుల్ని పూర్తి చేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి!