తేమ వాతావరణంలో నత్తలు ఎక్కువగా పెరుగుతాయి. నిన్నమొన్నటిదాకా ఎడతెరిపి లేని వానలతో ఎక్కడ చూసినా.. నత్తలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. పెరటి తోటలకు ఇవి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. నత్తలు ఆకులను తినడం వల్ల మొక్కలు బలహీనపడతాయి. కాండం, పండ్లను తింటూ.. పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఇక మొక్కల చుట్టూ నత్తలు వదిలే జిగట పదార్థం వల్ల.. మొక్కల పెరుగుదలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ క్రమంలో నత్తల నుంచి పంటలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.