(Less Sleeping) తక్కువగా నిద్ర పోవడం, అవసరానికి మించి నిద్రపోవడం.. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. తక్కువగా నిద్రపోయే వారిలో ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే సామర్ధ్యం తగ్గిపోతుందంట. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. సంపూర్ణంగా లేని నిద్ర లేదా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడుపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. మెదడుపై దీని ప్రభావం ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యంపై కనిపిస్తుందని వారు చెప్తున్నారు.
ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు నిద్రపోవాలి? తక్కువగా నిద్రపోతే ఏంటి? ఎక్కువగా పడుకోవడం వల్ల లాభాలుంటాయా? అనే విషయాలపై చాలా మందిలో సందేహాలు, అంతకుమించి అపోహలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఎన్ని అనుమానాలు ఉన్నా, ఎన్ని అపోహలు ఉన్నా చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా ప్రతిరోజూ 7.30 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం ఉత్తమం
అని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు. ఏడున్నర గంటల నిద్ర మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.
అల్జీమర్స్ వ్యాధికి సగం నిద్రకు సంబంధం ఉన్నదని గత పరిశోధనలోనే వెల్లడైంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేయడం వంటివన్నీ అల్జీమర్స్ వ్యాధి లక్షణాలే. అల్జీమర్స్ వ్యాధి నుంచి బయటపడాలంటే కనీసం ఏడున్నర గంటలు నిద్రపోవాల్సిందే అని సెలవిస్తున్నారు నిపుణులు.
రాత్రి నిద్ర ఎంతకూ రాకపోతే 4-7-8 శ్వాస పద్ధతిని అనుసరించడం చాలా మంచిది. యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ వెయిల్ ఈ సూత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ టెక్నిక్ ప్రాణాయామం మీద ఆధారపడి ఉంటుంది. ఈ టెక్నిక్‌ని ఎక్కువ కాలం పాటిస్తే త్వరగా నిద్రపోవడం ప్రారంభిస్తారు. ఈ టెక్నిక్ పాటించాలంటే నిశ్శబ్ద ప్రదేశంలో సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి లేదా పడుకోవాలి. నాలుక ముందు భాగాన్ని అంగిలితో దంతాల వెనుక ఉంచండి. ఇలా చేయడం వల్ల త్వరగా నిద్ర ముంచుకొస్తుందని డంకా బజాయించి మరీ చెప్పాడు ఆండ్రూ వెయిల్.
నిద్ర రాకుండా ఇబ్బంది పడుతున్నవారు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర ముంచుకొస్తుందని మన పెద్ద వాళ్లు చెప్తుంటారు. అదే విషయం చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో కూడా తేలింది. చైనాకు చెందిన నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ చేపట్టిన పరిశోధనలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ పాలలో ఉన్నట్లు వెల్లడైంది. ఇదే కాకుండా, మిల్క్ పెప్టైడ్ కేసైన్ హైడ్రోలైజేట్ కూడా పాలలో ఉంటుదని, ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేల్చారు.
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
రెండోరోజు కొనసాగిన రైతుల మహాపాదయాత్ర
గవర్నర్ ఆమోదంతోనే ఉత్తర్వులు, నిర్ణయాలు : మంత్రి బుగ్గన
ఎక్సైజ్ సిబ్బందిపై గిరిజనుల దాడి.. గంజాయి పండిస్తే తప్పేంటని ప్రశ్న
‘విద్యా కానుక’పై సీఎం జగన్ ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే!
బద్వేల్లో వైసీపీది ప్రజా విజయం : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టడమా? మంత్రి కొడాలి నాని ఫైర్
ప్రభుత్వ దవాఖానల్లో డ్రస్ కోడ్.. మండిపడుతున్న వైద్యులు
అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి: ఉపరాష్ట్రపతి
టీడీపీ గుర్తింపును రద్దు చేయండి : వైసీపీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..