Dress code : ప్రభుత్వ దవాఖానల్లో డ్రస్ కోడ్.. మండిపడుతున్న వైద్యులు
Dress code : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బంది ఇకపై డ్రస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్..

విజయవాడ : (Dress code) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బంది ఇకపై డ్రస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో విజయవాడ ప్రభుత్వ దవాఖానలో సోమవారం నుంచే డ్రస్కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం వైద్యులు స్టెతస్కోప్ , ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్, గుర్తింపు కార్డుతోపాటు పేరు, హోదా, ఐడీ నంబర్‌తో కూడిన బ్యాడ్జ్ విధిగా ధరించాలి. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసేవారికి ఇలా డ్రస్ కోడ్ విధించడం ఏంటని మహిళా వైద్యులు మండిపడుతున్నారు. స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు కూడా ఇదే డ్రెస్ ధరిస్తున్నారని చెప్పారు. విధుల్లో ఉన్నప్పుడు తాము ఇప్పటికే ఫుల్ స్లీవ్ వైట్ ఆప్రాన్ ధరిస్తున్నామని, డ్రస్ కోడ్ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా డ్రస్ కోడ్..
నూతన నిబంధనల ప్రకారం, హెడ్ నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది తెల్లటి టోపీ, రెడ్ స్ట్రిప్ ఐడీ కార్డ్‌తోపాటు హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. స్టాఫ్ నర్సులు ఐడీ కార్డ్, కలర్ ట్యాగ్‌తో కూడిన హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. ఫార్మసిస్టులు కూడా ఐడీ కార్డ్, స్కై బ్లూ కలర్ ట్యాగ్ హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. ల్యాబ్ టెక్నీషియన్లు ఐడీ కార్డ్, వైట్ కలర్ ట్యాగ్, వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో పనిచేస్తున్న నర్సులందరికీ ఒకే రకమైన డ్రస్ కోడ్ అమలు చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గతేడాది భారత నర్సింగ్ కౌన్సిల్‌కు లేఖ కూడా రాసింది.
ఇవి కూడా చదవండి..
అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి: ఉపరాష్ట్రపతి
టీడీపీ గుర్తింపును రద్దు చేయండి : వైసీపీ
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

