Bike Bot Scam : 15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
Bike Bot Scam : బైక్ బాట్ పేరుతో రూ.15 వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు సీబీఐ బట్టబయలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సంస్థ...

(Bike Bot Scam) పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం మొత్తం విలువ రూ.14,000 కోట్లు. అల్లుడు నీరవ్ మోదీ, మేనమామ మోహుల్ చోక్సీలు ఈ కుంభకోణంలో పాత్రధారులు. ఈ కుంభకోణాన్ని తలదన్నే మరో కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. బైక్ బాట్ పేరుతో రూ.15 వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు సీబీఐ బట్టబయలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సంస్థ, ప్రమోటర్లపై సీబీఐ కేసు నమోదు దర్యాప్తు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బైక్ బాట్ సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి.. మరో 14 మందితో కలిసి దేశవ్యాప్తంగా రూ.15,000 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేశారని తన ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొన్నది.
మోసం ఎలా మొదలెట్టారంటే..
ప్రధాన నిందితుడైన సంజయ్ భాటి.. బైక్ బాట్ పేరుతో బైక్ టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. దీని ముసుగులో లాభదాయకమైన ఆర్థిక పథకాలను రూపొందించాడు. తమ బైక్ టాక్సీ సర్వీసుల్లో బైక్ బాట్ వాహనాన్ని ఎవరైనా కొనుగోలుదారుడు తమ వద్ద ఉన్న డబ్బుతో ఒకటి, మూడు, ఐడు లేదా ఏడు బైక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బైక్‌లను తమ కార్పొరేట్ కార్యాలయమే నడుపుతుందని నమ్మించారు. ఆ విధంగా బైక్ బాట్లపై పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను తమవైపునకు తిప్పుకున్నారు. ఇలా పెట్టుబడి పెట్టినవారికి నెలవారీ అద్దె, ఈఎంఐతో పాటు ఎక్కువ బైక్‌లపై పెట్టుబడి పెడితే బోనస్ కూడా ఇస్తామంటూ ఆకస్తికరమైన ప్రోత్సాహకాలతో ఆకట్టుకున్నారు.
వివిధ నగరాల్లో కంపెనీ ఫ్రాంచైజీలను కేటాయించింది. ఈ ఫ్రాంచైజీల సాయంతో దేశం మొత్తం మీద పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులను ఆకర్శించింది. కేవలం రూ.62,200 పెట్టుబడి పెట్టి అద్దె పొందవచ్చునని, ఏడాదిలోగా బైక్ ఓనర్‌గా మారొచ్చునని నమ్మించింది. ఇలా రూ.62,200 పెట్టుబడి పెట్టిన వారికి 12 నెలలపాటు నెలకు రూ.9,765 చొప్పున అందిస్తామని ఊరించింది. తక్కువ టైంలో దాదాపు రెట్టింపు నగదు వస్తుందన్న ఆశతో దాదాపు 2 లక్షల మందికి పైగా వీరి వద్ద పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2017 లో ఈ పథకాలను ప్రారంభించిన ఈ సంస్థ.. 2019 జనవరి వరకు పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేయడం, తిరిగి చెల్లించడం వంటి ఠంచన్‌గా కొనసాగించింది.
రోజులు గడుస్తున్నా..
అయితే, కొన్నాళ్ల తర్వాత నెలలు గడుస్తున్నా అద్దెతో పాటు ఈఎంఐ చెల్లింపులు, బోనస్‌లు రాకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలా పెద్ద సంఖ్యలో డబ్బు తమ ఖాతాల్లో జమ అయిన తర్వాత, బైక్ బాట్ సర్వీసులు నడవడం లేదంటూ సంస్థ చేతులెత్తేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు మోసపోయినట్లు సీబీఐ గుర్తించింది. ప్రౌడ్ ప్రోగ్రెసివ్ ప్రమోటర్స్ రిస్ట్రిక్టెడ్ సంస్థతోపాటు దాని యజమాని సంజయ్ భాటి, ప్రమోటర్లపై ఇప్పటికే గౌతమ్ బుద్ధ నగర్‌లోని దాద్రీ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్‌పై తమ విచారణను ప్రారంభించింది. సంస్థ పేరుతో ఉన్న దాదాపు రూ.216 కోట్ల ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
నా చర్మంతో జగన్‌కు చెప్పులు కుట్టించినా రుణం తీరదు : నారాయణ స్వామి
సీక్రెట్‌గా క్వాంటం సూపర్ కంప్యూటర్ తయారుచేసిన డ్రాగన్
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

