ఇకపై ఫోన్లను కూడా యూజ్ అండ్ త్రో పద్ధతిలో వాడి పారేస్తారేమో! అంతలా రోజుకో మాడల్ బడ్జెట్ ఫోన్లు పుట్టుకొస్తున్నాయి. షామీ కంపెనీ కొత్త రెడ్మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 6.88 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగ్ A4S, జెనరేషన్ 2 ప్రాసెసర్, 50ఎంపీ కెమెరాతో ఫోన్ వస్తుంది. రెడ్మీ A4 5Gలో 5160mAh బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో మీరు రోజంతా ఉపయోగించడానికి సరిపడా బ్యాటరీ చార్జ్ పొందొచ్చు.
A4 5G రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఫోన్లో 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని microSD కార్డ్ ద్వారా 1TB వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. Android 14 ఆధారిత HyperOSపై ఇది పని చేస్తుంది. నాలుగేళ్ల వరకూ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. ఫోన్లో డ్యూయల్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ IP52 రేటింగ్‌తో వస్తుంది. దీంతో ఎలాంటి వెదర్ కండీషన్స్‌లో అయినా హ్యాపీగా వాడేసుకోవచ్చు. నీళ్లలో తడిసినా ఫోన్ పాడవదు.
ధర: రూ.8,499
దొరుకుచోటు: https://l1nq.com/INxYR
డెస్క్‌టాప్, ల్యాపీ ఏది వాడుతున్నా.. పోర్ట్‌తో పని ఎక్కువే! ఇలాంటప్పుడు మీ డివైజ్‌లకు అనువైన మల్టీ ఫంక్షనల్ హబ్ ఒకటి ఉంటే? అదే పోర్ట్రోనిక్స్ Mport 13C. దీంట్లో HDMI, Ethernet, VGA, PD చార్జింగ్ లాంటి ఫీచర్లతో కూడిన మల్టీ ఫంక్షనల్ హబ్‌గా దీన్ని వాడుకోవచ్చు. ఈ హబ్‌తో మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్టాప్ను సులభంగా అనేక పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. టైప్ సీ పోర్ట్, యూఎస్ బీ 3.0 పోర్ట్‌లు, మైక్రోSD, 3.5MM జాక్ ఇలా చాలా పోర్ట్‌లు ఉన్నాయి. ఈథర్నెట్ పోర్ట్‌తో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. Mport 13Cలోని PD చార్జింగ్ ఫీచర్‌ని వాడుకుని మీ గ్యాడ్జెట్స్‌ను వేగంగా చార్జ్ చేయొచ్చు. వీజీఏ, హెచ్డీఎంఐ పోర్ట్‌లకు కనెక్ట్ చేసి 1080 పిక్సెల్ క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. ఎక్కువ మన్నికతో పనిచేసేలా అల్యూమినియం మెటీరియల్‌తో ఈ హబ్‌ని తయారు చేశారు.
ధర రూ.: 3,999
దొరుకు చోటు: https://acesse.dev/ulZYr
కాషియో తన 50వ వార్షికోత్సవం సందర్భంగా ఒక వినూత్నమైన ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. అదే రింగ్ వాచ్. దీన్ని ఎంచక్కా వేలుకు ధరించవచ్చు. ఇందులో సమయం, తేదీ, స్టాప్‌వాచ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనికి ఉండే మూడు బటన్లు ఉపయోగించి టైమ్ జోన్ మార్చుకోవచ్చు. తేదీ చెక్ చేసుకోవచ్చు. స్టాప్‌వాచ్ ఫీచర్‌ను ఉపయోగించొచ్చు. అయితే, ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్ లేదు. సింపుల్‌గా, డిఫరెంట్ కనిపించే ఈ వాచ్‌ను యువత ఎక్కువగా ఇష్టపడుతుంది. ఈ రింగ్ వాచ్ పేరు CRW-001-1JR. దీని పరిమాణం ఒక అంగుళం కన్నా తక్కువే! స్టెయిన్లెస్ స్టీల్‌తో ఈ వాచ్‌ను తయారు చేశారు. నీటిలోనూ వాడుకోవచ్చు. తక్కువ వెలుతురు ఉన్నప్పుడు సమయాన్ని చూడటానికి ఇందులో లైట్ సోర్స్ కూడా ఉంది. అలారం పెట్టుకుంటే స్క్రీన్ మెరుస్తుంది. ఇందులోని బ్యాటరీ రెండేండ్ల వరకు పనిచేస్తుంది.
ధర: రూ.10,180
దొరుకుచోటు: https://l1nq.com/PgcFM
అతిథులు ఇంట్లోకి సరాసరి వచ్చేయడం తాతల నాటి ముచ్చట. తలుపు తట్టడమో, బెల్ నొక్కడమో అమ్మ తరం సంగతి. బెల్ మోగాక తలుపు తీసే వరకు ఎవరు వచ్చిందో తెలిసేది కాదు. డోర్‌కు ఉన్న దర్పణం నుంచి చూసి వచ్చింది అయినవారో, పరాయివారో కనుక్కునే సంప్రదాయమూ పాతదే! ఇప్పుడు డోర్ బెల్కే కెమెరా అమరింది. క్యూబో కంపెనీ అలాంటి వీడియో డోర్‌బెల్‌ను విడుదల చేసింది. ఇది ఇంటి భద్రతను పెంచడానికి, విజిటర్స్‌తో సులభంగా కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ డోర్‌బెల్ 2K రిజల్యూషన్ వీడియోను అందిస్తుంది. క్యూబో వీడియో డోర్‌బెల్‌ను మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించొచ్చు. దీంతో మీరు ఎక్కడున్నా.. ఇంటి తలుపు తట్టింది ఎవరో చూడొచ్చు.
వారితో మాట్లాడొచ్చు. ఒకవేళ మీకేదైనా డెలివరీ వచ్చిందనుకోండి! ఆ సమయానికి మీరు ఇంట్లోలేరు. అలాంటప్పుడు డోర్‌బెల్ ద్వారా ఆ డెలివరీ బాయ్‌తో మాట్లాడొచ్చు. ఇంట్లో ఏదైనా అనుమాన్పదమైన పరిస్థితి ఏర్పడితే.. వీడియో డోర్ బెల్ లోని అలారం సిస్టమ్ మోగించి అందర్నీ అప్రమత్తం చేయొచ్చు. అంతేకాదు.. మీరేదైనా వాయిస్ మెసేజ్‌ని రికార్డు చేసి దాన్ని డోర్‌బెల్‌లో లోడ్ చేయొచ్చు. దీంతో ఇంటికొచ్చిన వారికి ఎలాంటి సమాచారాన్ని అయినా చేరవేయొచ్చు. ఈ బెల్ మోగడానికి 36 రకాల ట్యూన్స్ ఉన్నాయి. నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. వాయిస్ కమాండ్స్‌తో బెల్ ఆపరేట్ చేసే వీలుంది.
ధర రూ.: 5,990
దొరుకు చోటు: https://acesse.dev/ulZYr