Rose Petals | ఇంత అందంగా కనిపిస్తుంది కాబట్టే ఆర్టిఫిషియల్ అయినా సరే ప్రతి డెకరేషన్లో గులాబీ రేకులనే వాడతారేమో!
Rose Petals | గులాబీ.. చేతికందిస్తే ప్రేమ. సిగలో తురిమితే అనురాగం. ఫ్లవర్ వేజులో పెడితే అలంకారం. నిజమే ముస్తాబులో గులాబీని మించిన వస్తాదు లేదు. అందుకే రంగురంగుల రోజాలతో పాటు, దాని రేకులూ అలంకారంలో అగ్రతాంబూలం అందుకుంటాయి. పెండ్లిళ్లూ, బర్త్‌డే పార్టీలూ, ప్రీ వెడ్డింగ్ షూట్లలో రోజ్ పెటల్ డెకరేషన్ అధికమవుతున్న వేళ, అచ్చుగుద్దినట్టు గులాబీ రెక్కలను పోలిన ‘రియలిస్టిక్ రోజ్ పెటల్స్' మార్కెట్లోకి వచ్చాయి. వాడిపోయే ముచ్చటే లేని ఈ పూరెక్కల ముచ్చటేంటో చూద్దాం!
Rose Petals | గులాబీ.. చేతికందిస్తే ప్రేమ. సిగలో తురిమితే అనురాగం. ఫ్లవర్ వేజులో పెడితే అలంకారం. నిజమే ముస్తాబులో గులాబీని మించిన వస్తాదు లేదు. అందుకే రంగురంగుల రోజాలతో పాటు, దాని రేకులూ అలంకారంలో అగ్రతాంబూలం అందుకుంటాయి. పెండ్లిళ్లూ, బర్త్‌డే పార్టీలూ, ప్రీ వెడ్డింగ్ షూట్లలో రోజ్ పెటల్ డెకరేషన్ అధికమవుతున్న వేళ, అచ్చుగుద్దినట్టు గులాబీ రెక్కలను పోలిన ‘రియలిస్టిక్ రోజ్ పెటల్స్’ మార్కెట్లోకి వచ్చాయి. వాడిపోయే ముచ్చటే లేని ఈ పూరెక్కల ముచ్చటేంటో చూద్దాం!

వేడుక ఏదైనా, ఆకర్షణీయమైన అలంకరణ కోరుకునేవారికి గులాబీలే గుర్తుకొస్తాయి. అయితే, అవి ఒక్కరోజులోనే వాడిపోయి, కాస్తంత అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకు భిన్నంగా.. ఎప్పటికీ వాడని
ఆర్టిఫీషియల్ రోజ్ పెటల్స్ వేడుకల అలంకరణను మరింత సులువు చేస్తున్నాయి.

అందంగా.. సహజంగా..
సహజ పుష్పాలకు ఆర్టిఫీషియల్ పువ్వులెప్పుడూ పోటీ కావు. కానీ ఏది నిజమైందో, ఏది కృత్రిమమో తెలియనంత సహజంగా తీర్చిదిద్దుతున్న ఈ రేకులు మాత్రం అలంకరణపరంగా అద్భుతమే! పిల్లలు నడిచేప్పుడో, పెళ్లికూతురూ పెళ్లికొడుకూ వచ్చేప్పుడో, ప్రీ వెడ్డింగ్ షూట్లప్పుడో.. స్టిల్స్ కోసమో గులాబీ రేకుల్ని వాడతారు. అలాంటప్పుడు నిజమైన పువ్వుల్ని కొని రేకుల్ని విడదీయడం ఖర్చుతో కూడిన పని. అంతేకాదు, నిజమైన రేకులు త్వరగా వాడిపోతాయి కూడా. అలాంటి సందర్భాల్లో ఈ రేకుల్ని వాడుకోవచ్చు. ఎరుపు, తెలుపు, పసుపు, నీలం.. ఇలా బోలెడు వన్నెల్లో దొరుకుతున్నాయి . వీటిని వస్త్రంతో చేస్తారు. ఆకృతే కాదు, అందులోని గీతలూ నిజమైన గులాబీ రేకులను మరిపిస్తాయి. గులాబీల సువాసనను కూడా వెదజల్లేలా.. ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి రూపొందిస్తున్నారు. మళ్లీ మళ్లీ వాడుకునేందుకూ పనికొచ్చే ఈ వసివాడని గులాబీల సోకు పుష్ప ప్రియులను తనవాళ్లను చేసుకుంటున్నది.

Rose Petals4

Rose Petals5


Read More :
Rose Flower : గులాబీ మొక్క.. 150పూలు ఎంచక్కా..!”
Fruit Carving | ఇంట్లో ఉండే పండ్లు, కూరగాయాలతో ఇలా అద్భుతాలు సృష్టించండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

