హయత్నగర్ రూరల్ : ఎక్కడైనా చెట్టుకు నాలుగో, పదో పువ్వులు పుస్తుంటాయి. తక్కువ చోట్ల 20నుంచి 30గులాబీ పువ్వులు కనిపిస్తుంటాయి. కానీ, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని కే నవీన్ అనే వ్యక్తి ఇంట్లోని గులాబీ చెట్టుకు మాత్రం ఏకంగా 150కిపైగా గులాబీ పువ్వులు పూసింది. ఏక కాలంలో ఒకే చెట్టుకు 150కిపైగా పువ్వులు పూయడం ఇదేమి తొలిసారి కాదని, గతంలో సైతం పూసిందని తెలిపారు నవీన్. ఇవి స్థానికులను అమితంగా ఆకర్శిస్తున్నాయి.