మనముందున్న అతిపెద్ద ప్రశ్న. రశ్మిక మందన్న అందాన్ని ఎవరితో పోల్చాలి? పూలతో పోల్చలేం. ఇట్టే వాడిపోతాయి. కానీ రశ్మిక.. ప్రతినిత్యం కొత్తగా వికసిస్తూనే ఉంటుంది. నిండు చందమామలా ఉందనీ అనలేం. ఆ వెన్నెల పక్షం రోజులకే పరిమితం.
ఈ కన్నడ కస్తూరి నడిచే నక్షత్ర మండలం. అందులోనూ, మిర్రర్ వర్క్‌తో చేసిన చారల లినెన్ కాటన్ చీర అందానికే అందం ఇచ్చింది. బార్డర్లో లేస్ ఎంబ్రాయిడరీ కూడా భేష్!