మీ కిచెన్‌ను పర్యావరణ హితంగా మార్చుకోండి. ప్లాస్టిక్‌తో తయారు చేసిన వస్తువులను అక్కడ ఉపయోగించ వద్దు. ప్లాస్టిక్ సీసాలు, కంటైనర్లు, బ్యాగ్‌లను వేరే వాటితో భర్తీ చేసుకోవచ్చు. వాటి స్థానంలో గాజు, చెక్కతో చేసిన వస్తువులను వాడుకోవచ్చు. ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తినీ ఇచ్చే అంశమిది.
పప్పు, ఉప్పు, పంచదారతోపాటు ఎన్నో పచారీ సామాన్లు వంటింట్లో ఉంటాయి. గబుక్కున తీసుకోవాల్సి వచ్చినప్పుడే వాటి డబ్బాలను వెతకాల్సి వస్తుంది. అలా సమయం వృథా అవకుండా, సీసాలపై లేబుల్స్ అంటించుకోవాలి. అప్పుడు ఏం కావాలన్నా సులువుగా తీసుకోవచ్చు.