ఒత్తిడితోనూ పొట్ట వస్తుంది. ఎక్కువ స్ట్రెస్‌కు గురయ్యేవారి శరీరంలో కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి సమస్య ఉంటే.. రోజూ గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఒత్తిడిని జయించి.. మెరుగైన నిద్రను పెంచి, కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించడంలో సాయపడుతాయి.
ఇక ఆల్కహాల్ అలవాటు ఉండేవారిలోనూ బెల్లీ ఫ్యాట్ కనిపిస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే.. శరీరం డీటాక్స్ అవ్వదు. దీంతో పొట్ట పెరుగుతుంది. ఇలాంటివారు బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తాగడం మంచిది. ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపిస్తుంది. కిడ్నీలు, లివర్‌ను డీటాక్స్ చేసి.. ఆరోగ్యంగా ఉంచుతుంది.