మన ప్రవర్తనను బట్టే ఎదుటివాళ్లు మనమేంటో తెలుసుకుంటారు. కానీ, మన నిద్ర కూడా మనల్ని అంచనా వేస్తుందట. నిత్యం ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో నిద్రపోతుంటారు. ఆ భంగిమలే మనం ఏ తరహా మనుషులమో ముద్ర వేస్తాయని ఓ పరిశోధన చెప్పుకొచ్చింది. నిద్రలో మీరు ఎక్కువ కంఫర్ట్ ఫీలయ్యే భంగిమేంటో మీకైతే తెలుసు కదా! దాన్ని బట్టి మీరెలాంటివారో తెలుసుకోండి..
ముడుచుకొని పడుకుంటే: కొంతమంది అచ్చం చిన్నపిల్లల్లాగే ముడుచుకొని నిద్రపోతారు. అలాంటివాళ్లు సైలెంట్‌గా, అమాయకంగా కనిపిస్తారు. బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. అందర్నీ ఇట్టే నమ్మేసి.. చివరికి మోసపోతుంటారట.
బోర్లాపడుకుంటే: మంచం ఎక్కగానే కొందరు బోర్లా పడుకుంటారు. వీరి స్వభావం కాస్త చిత్రంగానే ఉంటుందట. చాలా ఉల్లాసంగా ఉంటారట. కలుపుగోలుగా మాట్లాడే స్వభావం ఉంటుందట. కొన్నిసార్లు చాలా డల్‌గా ప్రవర్తిస్తుంటారు కూడా! రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేయరు.
దిండును హత్తుకుంటే..: ఇంకొందరు రాత్రంతా దిండును గట్టిగా హత్తుకొని నిద్రపోతుంటారు. వీళ్లు బంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట. తమకు నచ్చిన వ్యక్తికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి వెనుకాడరు.
వెల్లకిలా: కొందరు నిద్రలోనూ క్రమశిక్షణ పాటిస్తుంటారు. రాత్రంతా కదలకుండా, మెదలకుండా వెల్లకిలా పడుకుంటారు. వీళ్లు మెలకువలోనూ చాలా క్రమశిక్షణతో మెలుగుతుంటారట. ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకునే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది.
కులాసాగా: పలువురు నలుగురు నవ్వుకుంటే నాకేంటి అన్నట్లుగా కాళ్లూ, చేతులు బారజాపి స్టార్ఫిష్లా పడుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ప్రశాంతంగా, ఓపికగా ఉంటారట. స్నేహ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారట. నలుగురికీ సాయం చేసే స్వభావం కలిగి ఉంటారు.