ఉల్లి ఉపాయం పారట్లేదా?
జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుకు మంచి పోషణ అందించి, రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.
జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుకు మంచి పోషణ అందించి, రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయ ఉపాయాన్ని వారాల తరబడి ఫాలో అవుతున్నా.. సమస్య అలాగే ఉంటున్నదని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. దానికి గల కారణాలను ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.
ఉల్లిపాయ రసం వాడుతున్నా.. జుట్టు ఎక్కువగా రాలుతుంటే, దానికి అనేక కారణాలు ఉంటాయి. అసలు సమస్య ఏమిటి? దానికి ఉల్లిపాయలతో పరిష్కారం లభిస్తుందా? ఉల్లిని ఎలా వాడుతున్నారు? అనేది ముఖ్యం. నిజానికి, వివిధ సమస్యల వల్ల జుట్టు అధికంగా రాలుతుంటుంది. ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాలు, మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కూడా వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలకు ఉల్లిపాయ పరిష్కారం చూపించలేదు. ఎందుకంటే.. ఉల్లిపాయ రసం మాడు ఉపరితల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కానీ, అంతర్గత అసమతుల్యతలను పూర్తిగా సరిచేయలేదు.
ఇక శరీరంలో ఐరన్, ప్రొటీన్, విటమిన్ డి లోపం ఉన్నా, ఒత్తిడి హార్మోన్లు పెరిగినా.. ఇలాంటి పైపూత చికిత్సలు అంతగా ప్రయోజనం చేకూర్చలేవు. ఇలాంటి సమస్యలు కాకపోయినా.. ఉల్లిపాయ రసాన్ని తప్పుగా వాడటం కూడా మరో కారణమే! చాలామంది ఉల్లిపాయలతో చిక్కటి పేస్ట్ తయారు చేసి.. వడకట్టకుండానే నేరుగా మాడుకు పట్టిస్తారు. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. మాడుకు చికాకు కలుగుతుంది. దీన్ని కడగడం కూడా కష్టమవుతుంది. ఇక నిల్వ ఉన్న, పులిసిపోయిన ఉల్లిపాయ రసం వాడినా.. సమస్య అలాగే ఉంటుంది. అలా కాకుండా.. ఉల్లిపాయ రసాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవాలి.
జాగ్రత్తగా వడకట్టి.. రసాన్ని మాత్రమే మాడుకు పట్టించాలి. ఘాటు ఎక్కువైతే.. కలబంద, కొబ్బరి నూనె, భృంగ్రాజ్ (గుంట గలగరాకు) నూనె లాంటివి కలుపుకోవచ్చు. ఇక ఉల్లిపాయ రసాన్ని రెగ్యులర్గా వాడటం కూడా అంత మంచిదికాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే.. మాడు రక్షణ పొర చికాకు పెడుతుంది. సున్నితమైన చర్మం, చుండ్రు లాంటి సమస్యలుంటే.. మరింత ఎక్కువ అవుతాయి. తీవ్రమైన దురద, జుట్టు పొడిబారడం, మరింత రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే, ఆయుర్వేద సౌందర్య పద్ధతులను మితంగా పాటించాలని చెబుతున్నారు. చాలారకాల జుట్టుకు, ఉల్లిపాయ రసాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడితే సరిపోతుందని అంటున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

