New Year 2023 | కొత్త సంవత్సరంలో మార్చాల్సింది వస్తువులు కాదు.. ఇదీ అంటున్న జగ్గీ వాసుదేవ్
New Year 2023 | కొత్త సంవత్సరం వచ్చేస్తున్నది. వార్డ్‌రోబ్‌లోని బట్టలు మార్చేస్తాం. కొత్త దుస్తులు కొనుక్కుంటాం. ఇంట్లోని పాత క్యాలెండర్ మార్చేస్తాం. వీలైతే ఇంకాస్త అందమైనది గోడకు తగిలించే ప్రయత్నం చేస్తాం.
New Year 2023 | కొత్త సంవత్సరం వచ్చేస్తున్నది. వార్డ్‌రోబ్‌లోని బట్టలు మార్చేస్తాం. కొత్త దుస్తులు కొనుక్కుంటాం. ఇంట్లోని పాత క్యాలెండర్ మార్చేస్తాం. వీలైతే ఇంకాస్త అందమైనది గోడకు తగిలించే ప్రయత్నం చేస్తాం. ఏ బ్యాంకువాడో రుణం ఇస్తే.. కారు కూడా మార్చేస్తాం. మరింత విశాలమైన వాహనం కొంటాం. నిజానికి, మారాల్సింది ఇవన్నీ కాదు.. మన ఆలోచనా విధానం, గతాన్ని పట్టుకుని వేలాడే సంకుచిత స్వభావం. చెత్తను వదిలించుకుంటేనే కొత్తకు చోటు.
✉ ఇల్లు ఉండేది తలదాచుకోవడానికి కాదు, తల ఎత్తుకోవడానికి. మీ పిల్లలకు మంచి ఆలోచనలు ఇవ్వండి. మంచి అలవాట్లు నేర్పించండి. ఉత్తమ భావాలను ఆస్తిపాస్తులుగా రాసివ్వండి. వ్యక్తిత్వాన్ని వికసింపజేయండి. మనిషి విజయం ఇంటి నుంచే మొదలవుతుంది.
✉ స్వతహాగా మనిషి ఆనంద స్వరూపుడు. ప్రాణం పోస్తున్నప్పుడే సృష్టికర్త బంపర్ ఆఫర్ కింద ఆనందాన్ని ఇచ్చేశాడు. కానీ, మనిషే తనకుతాను కష్టాలనూ నష్టాలనూ సృష్టించుకుని జీవితాన్ని నిస్సారం చేసుకుంటున్నాడు.
✉ చంద్రుడి మీదికి వెళ్లాం. అంగారకుడిని పలకరించాం. అంతరిక్షంలో విహారాలు చేస్తున్నాం. కానీ భూగ్రహం మీద ఎలా బతకాలన్న ఎరుక మాత్రం మనకు లేకుండా పోతున్నది. దయచేసి ఈ నేలను చెత్తబుట్టగా మార్చకండి. మీకు పుణ్యం ఉంటుంది .. జలాశయాలను మురుగునీటి కుంటల్లా తయారు చేయకండి.
✉ ఆధ్యాత్మికత ఆహార్యంలోనో, జీవనశైలిలోనో లేదు. ఆలోచనల్లో ఉంది. వర్తమానాన్ని వదిలి భవిష్యత్తు వైపు ప్రయాణించడమే అసలైన ఆధ్యాత్మికత.
✉ ఒకే పనిని పదేపదే చేయడం వల్ల సృజన చచ్చిపోతుంది. కాబట్టి, కొత్తగా ఆలోచించండి. కొత్త లక్ష్యాలను ఎంచుకోండి. కొత్త విజయాలు సాధించండి.
✉ నీ మనసు ప్రశాంతంగా లేకపోతే, ప్రపంచం మాత్రం ప్రశాంతంగా ఎలా కనిపిస్తుంది? అణువులో ఉన్నదే బ్రహ్మాండంలో గోచరిస్తుంది. మనసులో మెదిలేదే, కండ్లముందు ప్రత్యక్షం అవుతుంది.
✉ ఉద్వేగాలను జయించడానికి ఒకటే మార్గం.. అంతులేని సహన గుణం.
✉ ఆరోగ్యం గురించి అతిగా ఆలోచించడం కూడా ఓ రకమైన అనారోగ్యమే. వీలైతే మీ ఆలోచనలను ఆనందం వైపు మళ్లించండి. ఆనందం వెనకాలే ఆరోగ్యమూ వస్తుంది.
– సద్గురు జగ్గీ వాసుదేవ్
Read More :
“Suresh Raina | టాలెంట్ మాత్రమే సరిపోదు.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన సురేశ్ రైనా”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

