మోటోరోలా.. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. అత్యాధునిక ఫీచర్లతో, పవర్‌ఫుల్‌గా.. ‘మోటో జీ06 పవర్’ మాడల్‌ను తీర్చిదిద్దింది. 6.88 అంగుళాల హెచ్డీ స్క్రీన్‌తో వస్తున్నది. 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 395 పీపీఐ, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3 ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇందులో మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో చాలా శక్తిమంతంగా పనిచేస్తుంది. ఎలాంటి ల్యాగ్స్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు. 256 జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్లో.. మెమొరీని 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇక కెమెరా విభాగానికి వస్తే.. 50 ఎంపీ ఎఫ్/1.8 ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనితో 4కెలో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
సెల్ఫీల కోసం ముందు భాగంలో ఎఫ్/2.05 అపర్చర్‌తో 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వ్యవస్థ.. ఇందులోని అతిపెద్ద ప్రత్యేకత! బ్యాటరీ బ్యాకప్ గురించి ఎలాంటి చింతా అవసరం లేదు. భద్రత కోసం సైడ్‌మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ఏర్పాటుచేశారు.
ఆండ్రాయిడ్-15 ఆధారంగా హలో యూఐతో ఈ ఫోన్ పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్ 6.0, జీపీఎస్, యూఎస్బీ-సీ, డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్లాంటి సౌకర్యాలు ఉండనే ఉన్నాయి. బడ్జెట్లోనే అత్యాధునిక ఫీచర్లతో ఫోన్ కావాలనుకున్నవారికి.. మోటో జీ06 పవర్ మంచి ఎంపిక. దీని ధర సుమారు రూ.13,500.