ఈ సాంకేతిక యుగంలో బయటికి వెళ్లిన వారి గురించి గుమ్మం దగ్గర పడిగాపులు కాయాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. అందులో మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సేఫ్టీ (Microsoft Family Safety) యాప్ ఉంటే మరీ మంచిది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ పేరు, ఇతర వివరాలతోపాటు ఫ్యామిలీ ఆప్షన్లో కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలి.
అయితే, మీరు ఎవరి పేరైతే ఇన్క్లూడ్ చేయాలని భావిస్తున్నారో.. ఆ కుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరి. ఇక, మీ ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనికి వాళ్లు తమ ఫోన్లో లొకేషన్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ యాప్ ద్వారా పిల్లలు ఫోన్లో చూసే వీడియో కంటెంట్‌ను నియంత్రించొచ్చు కూడా!