న్యూఢిల్లీ : మొబైల్ కిచెన్స్ మార్కెట్లో సందడి చేస్తూ సామాన్యుల ఆకలి (Viral Video) తీర్చేస్తున్నాయి. ఊహించని ప్రాంతాల్లో సైతం రుచికరమైన ఆహారాన్ని వండివారుస్తున్నాయి. తాత్కాలికంగా ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ఆన్ వీల్స్ అంటూ మొబైల్ కిచెన్స్ వాహనదారులు, అటుగా వెళుతున్న వారి ఆకలి తీరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నుంచి పట్నా వెళుతున్న ఓ వ్యక్తి తన ట్రక్ లోపల టేస్టీ చికెన్ కర్రీ, రైస్ డిష్‌లను వండిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
అతడి కుమారుడు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈరోజు నాన్న తన ట్రక్‌లో టేస్టీ చికెన్‌ను తయారుచేశాడని వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. ఇవాళ తాము దేశీ చికెన్‌ను వండుతున్నామని కట్ చేసిన ఆనియన్స్‌ను కెమెరా వైపు చూపుతూ ఈ వీడియోలో ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. సిలిండర్‌కు కనెక్ట్ చేసిన స్టవ్ వద్ద స్టీల్ పాత్రలో ఆనియన్స్‌ను వేస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో హైవే సమీపంలో టోల్ గేట్స్ కనిపించాయి.
ఆపై ప్రెజర్ కుక్కర్‌ను తీసుకున్న వ్యక్తి అందులో చికెన్ పీస్‌లను వేసి ఉడికించడంతో పాటు టేస్టీ చికెన్ కర్రీని కొడుకుతో పాటు ఆస్వాదించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ వ్యక్తి కొందరు ఫుడ్ బ్లాగర్స్ కంటే చాలా నయమని ఓ యూజర్ కామెంట్ చేశారు. అంకుల్‌ను అసలు ద్వేషించే వారే ఉండరని ఓ యూజర్ రాసుకొచ్చాడు. మీ ట్రక్‌లో పనిచేసేందుకు అప్లికేషన్ ఎక్కడ లభిస్తుందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :