Man Stabbed | చట్నీ అడిగాడని వ్యక్తిపై మోమో విక్రేత కత్తిపోట్లు
అదనపు చట్నీ అడిగినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన మోమో విక్రేత ఓ వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన (Man Stabbed) ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో వెలుగుచూసింది.
ఢిల్లీ : అదనపు చట్నీ అడిగినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన మోమో విక్రేత ఓ వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన (Man Stabbed) ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో మొబైల్ చార్జర్ మేకింగ్ యూనిట్‌ను నిర్వహించే సందీప్ షాదారా ప్రాంతంలోని విశ్వాస్ నగర్లో మోమోస్ తినేందుకు బుధవారం ఓ దుకాణానికి వెళ్లాడు.
షాపు యజమాని వికాస్‌ను మరోసారి చట్నీ వేయాలని కోరాడు. అందుకు వికాస్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో వికాస్ బాధితుడిపై కత్తితో దాడి చేసి ఆపై పరారయ్యాడు. ముఖంపై కత్తిపోట్లకు గురైన సందీప్‌ను స్ధానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ప్రస్తుతం సందీప్ పరిస్ధితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వికాస్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వికాస్‌కు సహకరించిన ఇతర నిందితులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Aadhar | ఆధార్ డాటాపై ఫికర్.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న వివరాలు!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

