ప్రొఫెషనల్ మెయిల్ చేయాలన్నా, అఫీషియల్ డాక్యుమెంట్ రాయాలన్నా.. ఇంగ్లిష్‌పై మంచి పట్టు ఉండాలి. ఫార్మాట్ తెలిసి ఉండాలి. అతికొద్ది మంది మాత్రమే ఈ విషయంలో ముందుండేవారు. వారికి అంతా ఇంతా డిమాండ్ ఉండదు. ఇప్పుడు రాసేది ఏ విషయమైనా.. ఆన్లైన్ టూల్స్ చూసుకుంటున్నాయి. ఈ సేవల్లో గ్రామర్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం చేసే గ్రామర్ మిస్టేక్స్ అన్నీ అదే సరిదిద్దేది. ఇప్పుడు గ్రామర్లీ కొత్తగా ‘ఏఐ ఏజెంట్స్’ని రంగంలోకి దింపింది.
ఫుల్ప్యాకేజ్ రైటింగ్ అసిస్టెంట్‌గా గ్రామర్లీ పనిచేస్తున్నది. విద్యార్థులు, అధికారులు.. ఇలా ఎవరైనా ఏ తరహా మెయిల్ రాయాలన్నా… ఏఐ ఏజెంట్స్ చూసుకుంటాయి. ఒక్కో ఏజెంట్ ఒక్కో పనిలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఫ్రీ వెర్షన్లోనూ మంచి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.