చెప్పింది.. వినండి!
చాలామంది బంధంలో ప్రేమను మాటలతో మాత్రమే కొలుస్తారు. కానీ దాన్ని నిలబెట్టేది మాత్రం ఎదుటివారి మాటను పూర్తిగా వినగలిగే ఓర్పు కూడా. చాలాసార్లు భాగస్వామికి సలహా అవసరం ఉండదు. తన భావాలను ఎలాంటి తీర్పులు లేకుండా వినే మనిషి చాలు.
చాలామంది బంధంలో ప్రేమను మాటలతో మాత్రమే కొలుస్తారు. కానీ దాన్ని నిలబెట్టేది మాత్రం ఎదుటివారి మాటను పూర్తిగా వినగలిగే ఓర్పు కూడా. చాలాసార్లు భాగస్వామికి సలహా అవసరం ఉండదు. తన భావాలను ఎలాంటి తీర్పులు లేకుండా వినే మనిషి చాలు. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోవడం, వెంటనే తప్పొప్పులు చెప్పడం, తమ అనుభవాలతో పోల్చడం వల్ల అసలు భావం పకదారి పడుతుంది. అలా కాకుడా ‘నీ మాట నేను వింటున్నాను’, ‘నువ్వు చెప్పేది నాకు ముఖ్యం’ అనే భావన కలిగితేనే ఇరువురి మధ్య భావోద్వేగ భద్రత ఏర్పడుతుంది.
అదే బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. మనస్తత్వ నిపుణులు కూడా చెప్పేదేమిటంటే… మంచి శ్రోతగా ఉండే భాగస్వాముల మధ్య అపార్థాలు తకువగా ఉంటాయి. సమస్యలు వచ్చినా కలిసి పరిషారం వెతికే అవకాశాలు ఎకువగా ఉంటాయి. అందుకే ప్రతి సంభాషణలో సమాధానం చెప్పడానికి కాకుండా, అర్థం చేసుకోవడానికి వినండి. నిజానికి, అనుబంధంలో గొప్ప బహుమతి ఖరీదైన కానుక కాదు… మనస్ఫూర్తిగా వినే సమయం. ఎందుకంటే ప్రేమకు కొన్నిసార్లు మాటలు అవసరం ఉండకపోవచ్చు, వినే మనసు మాత్రం ఎప్పుడూ అవసరమే!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

