అందం నుంచి ఆరోగ్యం వరకూ.. నిమ్మకాయ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వంటల్లోనే కాకుండా.. వంటగదిని శుభ్రం చేయడంలోనూ సాయపడుతుంది. ‘ఫ్రిజ్’ను తాజాగా ఉంచడంలోనూ నిమ్మకాయ ముందుంటుంది. దీనిని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచితే.. అనేక ప్రయోజనాలు అందిస్తుంది.
నిమ్మకాయలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు సమర్థంగా పనిచేస్తాయి. ఆహార పదార్థాలు కుళ్లిపోకుండా కాపాడుతాయి. అయితే, ఫ్రిజ్‌లలో ఉంచడానికి తాజాగా, శుభ్రంగా ఉండే నిమ్మకాయలను మాత్రమే ఉపయోగించాలి.