కన్నడ కస్తూరి పరిమళం తెలుగువారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ముక్కుపుటాలే కాదు, కనుబొమలూ ఎగిరెగిరి పడతాయి.
ఎంతోమంది బెంగళూరు భామలు తెలుగు ప్రేక్షకులతో ‘క్యా (బిసిబేళె) బాత్ హై!’ అనిపించుకుంటున్నారు. ఆ జాబితాలో తాన్యా హోప్ పేరు కూడా ఉంది. ఎవరికి తెలుసు.. తను రేపటి రష్మిక మందన్న అయినా కావచ్చు. ఎర్రచీర, ఎర్ర స్లీవ్‌లెస్ జాకెట్, యాంటిక్ నగలు, మాగ్నటిక్ నవ్వులు.. ఆ మాట నిజమే అంటున్నాయి.