Scented Candles | కొవ్వొత్తులు.. తాను కాలుతూ ఇతరులకు వెలుగులు పంచుతుంది. పూరి గుడెసెలో ఉండే వారి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు కొవ్వొత్తులను ఏదో ఒక రకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటి తయారీలో కొత్త దనం చోటు చేసుకున్నది. ఉత్పత్తితో పాటు వినియోగం కూడా పెరిగింది. చాలా ఇండ్లలో అలంకరణకు సెంటెడ్ క్యాండిల్స్ (Scented Candles) వాడుతున్నారు. సెంటెడ్ క్యాండిల్స్ వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సెలవిస్తున్నారు నిపుణులు.
సెంటెడ్ క్యాండిల్స్ లగ్జరీకి మారుపేరుగా నిలుస్తున్నాయి. రోజంతా ఎన్నో పనులతో అలసిపోయి ఇంటికి వచ్చే వారికి ఈ సెంటెడ్ క్యాండిల్స్ మనశ్శాంతితోపాటు ఆనందాన్నిస్తాయని నిపుణులు చెప్తున్నారు. సెంటెడ్ క్యాండిల్స్‌తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఓ లుక్కేద్దాం..
మెరుగైన నిద్ర
మనలోని జీవ గడియారం (Biological clock) ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో సూచిస్తుంది. నిద్రవేళకు ముందు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తే.. కొవ్వొత్తి జ్వాల శక్తివంతమైన నిద్ర ఆరోగ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పెద్ద వయసులో వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కళ్ళు నీలి కాంతికి గురికాకుండా నిరోధించడమే కాకుండా మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది.
మెరుగైన జ్ఞాపకశక్తి
మెదడు అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటి జ్ఞాపకశక్తి. ఇటీవల జ్ఞాపకశక్తి (memory) కొద్దిగా మబ్బుగా లేదా గజిబిజిగా ఉన్నట్లయితే లేదా విషయాలు గుర్తుకు తెచ్చుకోవడంలో సమస్య ఉంటే సువాసన గల కొవ్వొత్తులు వాడినట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి, భావోద్వేగం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మంచి అనుభూతిని కలిగిస్తాయి.
మైండ్‌ఫుల్‌నెస్ ప్రభావం
ఒకరి మానసిక స్థితి, ఉత్పాదకత స్థాయి, ఒత్తిడిపై వాసన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ప్రత్యేకించి సువాసనగల కొవ్వొత్తులు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి.
ఒత్తిడి నివారిణి
కొన్ని రకాల కొవ్వొత్తుల సువాసనలు శరీరంలోని కార్టిసాల్ స్థాయి (Cortisol) లను తగ్గిస్తాయి. అదే సమయంలో డోపమైన్ (Dopamine), సెరోటోనిన్ (Serotonin) వంటి రసాయనాలు స్రవించేందుకు కారణంగా నిలుస్తుంది. ఇవి శక్తిని పెంచి, ఉత్పాదక మనస్తత్వాన్ని అలవర్చుకోవడంలో సహాయపడుతుంది.
ఆధ్యాత్మిక ఆరోగ్యం
క్రమం తప్పకుండా మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ సాధన చేసేవారికి సెంటెడ్ క్యాండిల్స్ సన్నిహిత స్నేహితులుగా ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జాస్మిన్, లావెండర్, పిప్పరమింట్ వంటి రకాలు ఆహ్లాదకరమైన వాసనలు అందిస్తాయి. ఇవి స్వీయ-విజువలైజేషన్ వ్యాయామాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యోగాభ్యాసం చేయాలన్న కోరికను పెంచుతాయి.