ఇంట్లో వైఫై ఉందంటే చాలు. టాప్ స్పీడ్‌లో బ్రౌజింగ్ చేయాలనుకుంటాం. ఒకేసారి టీవీ, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు.. ఎన్ని వాడినా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటాం. ఇలాంటి అవసరాలు ఉన్నవారి కోసం రిలయన్స్ జియో ఒక కొత్త వైఫై రూటర్‌ను తెచ్చింది. దీని పేరు ఏఎక్స్ 6000-వైఫై 6 రూటర్. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇంటికి 2,000 చదరపు అడుగుల వరకు వైఫై సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ మీ ఇల్లు బాగా పెద్దదైతే.. జియో ఎక్స్టెండర్స్ పెట్టి సిగ్నల్‌ను ఇంకా పెంచుకోవచ్చు.
ఈ రూటర్ ‘అన్ని కనెక్షన్లకూ పని చేస్తుంది’ అని జియో చెబుతున్నది కానీ.. జియో ఫైబర్ వాడే వాళ్లకు మరింత ప్రత్యేకం. జియో లక్ష్యం ఏంటంటే.. ఇళ్లలో ఇంటర్నెట్ను, టీవీని, స్మార్ట్ పరికరాలన్నిటినీ తమ నియంత్రణలో ఉంచుకోవడం. దానిలో భాగంగానే ఈ రూటర్‌ను కాస్త తక్కువ ధరకే ఇస్తున్నది. దీని అసలు ధర ఎక్కువే అయినా.. జియో దీన్ని రూ.5,999కే ఇచ్చేందుకు సిద్ధమైంది.