బయట చలిగా ఉంది కాబట్టి మనకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్‌లు వేసుకుని తిరగడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాగని స్వెటర్లనో స్కార్ఫ్లనో నిండాకప్పుకొని తిరగడమూ చాలామంది అమ్మాయిలు ఇష్టపడరు. అలాంటప్పుడు అటు చలినీ ఇటు ఫ్యాషన్నీ బ్యాలెన్స్ చేస్తూ రెంటికీ సరిపోయేలా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి ‘క్రాప్డ్ స్వెటర్ సెట్’లు లేదా ‘కార్డిగాన్ కామిక్రాప్ వింటర్ టాప్’లు.
ఇందులో మనం స్లీవ్‌లెస్‌గా వేసుకునే కామి టాప్ దాని మీద కోట్లా వేసుకునే కార్డిగాన్ లేదా షార్ట్ ఓవర్కోట్లు ఉన్ని అల్లికతో వస్తున్నాయి. మనం స్వెటర్ వేసుకున్నట్టుగానే వెచ్చదనాన్ని ఇస్తాయి. పూలు, డిజైన్లు ఉండి ఫ్యాషనబుల్‌గానూ కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే క్రాప్‌టాప్, షార్ట్ కోట్లా తయారు చేసిన స్వెటర్లు అన్నమాట. ఇవి ఉంటే ఇక చలిలోనూ ఫ్యాషన్‌ను వదలాల్సిన పని ఉండదు!