పాలు, పెరుగు, పచ్చళ్లు, స్వీట్లు, స్నాక్స్.. ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఆకర్షించే రంగులు, అందమైన బొమ్మలతో ఉండే ఈ ప్లాస్టిక్ కవర్లను చూసి ఇష్టపడి కొంటారు. కానీ, ఈ ప్లాస్టిక్‌తో వచ్చే ముప్పు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. పాలీ కార్బోనేట్ ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో బిస్పినాల్ ఏ (బీపీఏ) రసాయనం ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. ముఖ్యంగా లైంగిక హార్మోన్లను ఇది ప్రభావితం చేస్తుంది. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్లలో ఉండే సమతుల్యతను దెబ్బతీ స్తుంది.
మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గుతుంది. ఆడవాళ్లలో పీసీఓఎస్ సమస్యలు వస్తాయి. ఈ ఇబ్బందులే కాకుండా టైప్ 2 డయాబెటిస్, నాడీ వ్యవస్థలో సమస్యలు, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. సేంద్రియ ఉత్పత్తులు కూడా ప్లాస్టిక్‌తోనే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం ఎంచుకోవాల్సిందే!