నైట్ షిఫ్ట్.. తిండి సంగతేంటి?!
హలో జిందగీ. నేను ఒక ఐటీ ఉద్యోగిని. మాది అమెరికన్ కంపెనీ. దీంతో ఏడాదిన్నర నుంచి రోజూ నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నా. కానీ ఇటీవల లావు అవుతున్నాను. అంతకు మునుపుతో పోలిస్తే ఉత్సాహం కూడా తగ్గింది.
హలో జిందగీ. నేను ఒక ఐటీ ఉద్యోగిని. మాది అమెరికన్ కంపెనీ. దీంతో ఏడాదిన్నర నుంచి రోజూ నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నా. కానీ ఇటీవల లావు అవుతున్నాను. అంతకు మునుపుతో పోలిస్తే ఉత్సాహం కూడా తగ్గింది. లేటుగా లేవడం లేటుగా తినడంలాంటివే ఇందుకు కారణమా? అసలు నాలా నైట్ షిఫ్ట్‌లు చేసే వాళ్లు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుపగలరు?
- ఓ పాఠకురాలు
నైట్ షిఫ్ట్ అంటే… మన జీర్ణవ్యవస్థ విశ్రాంతికి ఉపక్రమించే సమయంలో మనం ఆహారం తింటాం. నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తాం. దీని వల్ల జీవగడియారం అస్తవ్యస్తం అవుతుంది. ఇది ఒక్క ఊబకాయానికే కాదు, షుగర్, బీపీ, గుండె జబ్బులు, జీవక్రియలో అసమతుల్యత లాంటి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని రంగాల్లో తప్పని ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతులాహారాన్ని ఇలా తీసుకోవాలి.
- రాత్రి షిఫ్టుకి వెళ్లాక తినాలి అనుకోకుండా… కుటుంబంతో కలిసి కాస్త పెందలాడే భోజనం కానివ్వండి. అందులో తక్కువ మోతాదులో సంతృప్త కొవ్వులుండే చికెన్, చేపల్లాంటి వాటితో పాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కలిగిన బ్రౌన్‌రైస్ లేదా మిల్లెట్లను కలిపి తీసుకోండి.
- అధిక మొత్తంలో పండ్లు, తాజా కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎక్కువ ఉత్సాహంగా ఉండగలుగుతారు. మొత్తం ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామన్నది లెక్క చూసుకుంటూ, కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తినడం కూడా శరీరాన్ని చురుగ్గా ఉంచే పనే.
- ఉదయం అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పెసరట్టు, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ, పల్లీ చట్నీ, సాంబార్లాంటివి తినొచ్చు. మాంసాహారులైతే ఉడకబెట్టిన గుడ్డు, చికెన్ సూప్‌లాంటివి తీసుకోవచ్చు. బొబ్బర్లు, పెసలు, శనగల్లాంటి వాటితో సలాడ్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఏవైనా పడుకోవడానికి గంట ముందు తినాలి.
- రాత్రి మెలకువతో ఉండటానికి కెఫీన్ సహకరిస్తుంది. కానీ అది మీ నిద్రకూ భంగం కలిగిస్తుంది. కాఫీనో, కెఫీన్ డ్రింకో తాగినప్పుడు… అది శరీరాన్ని వదలడానికి 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆచితూచి తీసుకోవాల్సిందే.
- పగలు సరైన నిద్ర రావాలంటే అరగంట ముందు టీవీ, ఫోన్లను ఆపేయండి. ప్రశాంతమైన చీకటి గదిని ఎంచుకోండి. నిద్రకు ముందు కాస్త రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయండి. చక్కని ఆహారపు అలవాట్లతో పాటు ఒకే సమయానికి రోజూ నిద్రపోవడం అన్నది కూడా ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపుతుంది.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

