Health tips | మీరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార నియమాలు పాటించాల్సిందే..!
Health tips | ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య పెరగకుండా ఉంటుంది, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత ముదురుతుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య పెరగకుండా ఉంటుంది, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత ముదురుతుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తీసుకోవాల్సినవి..
వెల్లుల్లి
ఫ్యాటీ లివర్ సమస్యపై చేసిన ఆనేక పరిశోధనల ప్రకారం.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయట పడటానికి వెల్లుల్లి చాలాబాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉన్నాయి.
గ్రీన్ టీ
యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉన్న గ్రీన్ టీ కూడా ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో తోడ్పడుతాయి. అదేవిధంగా మన శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను, ఫ్యాటీ లివర్ని తగ్గించడంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
అవకాడో
ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారికి అవకాడో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి కాలేయాన్ని ఎంతో సురక్షితంగా ఉంచడంతోపాటు బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
తీసుకోకూడనివి..
పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్లు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడంవల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి. చక్కెరలు పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దాంతో ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.
చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్
అదేవిధంగా చక్కెరలు ఎక్కువగా ఉండే చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ లాంటి పదార్థాలు కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ప్రమాదకరం. వాటితో కాలేయంలో చక్కెరలు చేరి ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

