పోపుల డబ్బాలోని చిట్టిచిట్టి ఆవాలు.. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో గట్టిగానే పనిచేస్తాయి. వంటలకు రుచితోపాటు కమ్మని వాసనతోపాటు ఆరోగ్య ప్రయోజ నాలనూ అందిస్తాయి. అనేక పోషకవిలువలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగిన ఆవాలు.. ఆయుర్వేదంలోనూ ఉపయోగపడుతాయి.
ఆవాలలో మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. డైటరీ కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, బీటా కెరోటిన్, పొటాషియం, సోడియంతోపాటు అన్ని రకాల విటమిన్లు అధిక మోతాదులో లభిస్తాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.