Romance Ability | చాలా మందిలో శృంగారం పవర్ ఉన్నప్పటికీ.. పడక గదిలోకి చేరగానే అత్తిపత్తిలా ముడుచుకుపోతున్నారు. అంగస్తంభన సమస్యతో థర్మామీటర్లోని పాదరసంలా తుస్మని నీరసిచిపోతున్నారు. దీంతో ఏదో తెలియని వెలితితో నిద్రలేని రాత్రిళ్లు గడుపుతుంటారు. వాస్తవానికి బెడ్రూంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడూ సంభోగించాలని ఆరాటపడటం సర్వసాధారణం. అయితే, శృంగార సామర్ధ్యం తగ్గిపోవడం వల్ల తుస్మని పోతున్నారు. ఇలాంటి సమస్యలకు ముఖ్య కారణాలు ఇవీ..
రక్తప్రసరణలో లోపం..
సాధారణంగా అంగస్తంభన విఫలం కాగానే మనస్సులో భయం, కంగారు, ఆందోళన, రకరకాల కాంప్లెక్స్ ఫీలింగ్స్ కారణమని మనలో ఆలోచనలు వస్తుంటాయి. అయితే, పురుషాంగం స్తంభించకపోవడంలో నరాలు, హార్మోన్లు, రక్తనాళాల పాత్ర కూడా ఉంటుంది. రక్తప్రసరణలో లోపం ఉన్నపుడు, పురుషాంగానికి దెబ్బ తగిలినప్పుడు స్తంభన సమస్యలు ఏర్పడుతుంటాయి. అధికంగా స్మోకింగ్ చేసేవారిలో, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ అధిక శాతంలో ఉన్నవారిలో రక్తనాళాలు అనారోగ్యంగా మారి అంగం స్తంభించదని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు.
స్కలన సమస్యలు..
స్కలనం సమస్యలనేవి పురుషుల్లో సర్వసాధారణ లైంగిక సమస్యల్లో ఒకటిగా నిలిచింది. స్కలనం ఆలస్యం అవడం లేదా తొందరగా స్కలనం జరుగడం వల్ల పురుషులు, స్త్రీలు శృంగారంలో ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఫలితంగా ఒకరిపై ఒకరికి ఏహ్యభావం నెలకొని జంటలు విడిపోయేందుకు కూడా కారణమవుతున్నాయి. అయితే, రక్తంలో ప్రోలాక్టిన్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల, కొన్ని రకాల జన్యు, హార్మోన్ల కారకాలు కూడా శీఘ్ర స్కలనానికి దారితీసే ప్రమాదం ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు.
తక్కువ లైంగిక వాంఛ..
పురుషుల్లో లైంగిక వాంఛలు సర్వసాధారణం. అయితే, ఈ వాంఛలు లేకపోవడం అనేది దీర్ఘకాలిక రుగ్మతగా భావించాలి. దీనికి కచ్చితమైన కారణం ఇదీ అని ఇంత వరకు తేల్చలేదు. కానీ, అంచనాలు, ఆందోళనలు ప్రమాదాన్ని పెంచుతాయని మర్చిపోవద్దు. కొన్ని వ్యాధులకు గురవడం, తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్ వంటి వాటి కారణంగా కూడా లైంగిక వాంఛ సన్నగిల్లే అవకాశాలు ఉంటాయి. యాంటీ డిప్రెసెంట్ మందులు వాడే వారిలో లైంగిక హార్మోన్లు అయిన డోపమైన్, ప్రోలాక్టిన్ విడుదలను నిరోధిస్తాయి. ఫలితంగా లైంగిక వాంఛ తగ్గుతుంది. వయస్సు కూడా సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోవడానికి దోహదంగా నిలుస్తుంది.
మహిళల్లో కొన్ని కారణాలు..
ఉద్యోగ, కుటుంబ వ్యవహారాల కారణంగా మహిళలు త్వరగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ప్రశాంతమైన మానసిక స్థితి రతిక్రీడలో మహారాణులుగా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.
సెక్స్ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా మహిళల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఇది వారి భాగస్వామిపై ప్రభావం చూపుతుంది. దీనికి సెక్స్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఉత్తమం.
మనసు, శరీరం చురుకుగా లేకపోవడం వల్ల కూడా శృంగారం అంటే ఆసక్తి సన్నగిల్లుతుంది. చురుకుదనం కోసం ఏరోబిక్ వ్యాయామాలను ఎంచుకోవాలి. రక్తప్రవాహాన్ని పెంచే చిన్నపాటి ఎక్సర్సైజులతో శృంగార కోరికల్లో మార్పును పొందవచ్చు.
ఆహారమూ ముఖ్యమే..
ఏదో తింటున్నాం… అని తినేవారిలో శృంగార జీవితం అంత పవర్ఫుల్గా ఉండదన్నది నిపుణుల మాట. సంభోగం మరింత రసరంజుగా ఉండాలంటే అనేక రకాల విటమిన్లు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ప్రధానమైనది ఏ విటమిన్. ఇది ఎపిథీలియల్ టిష్యూలను ఆరోగ్యంగా ఉంచి పురుషాంగంను శక్తివంతంగా ఉంచుతుంది. మహిళల యోనికి కూడా సెక్స్పరంగా మంచి స్పందనలు కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్, వెన్న, గుడ్డు పచ్చసొనలో ఈ విటమిన్ లభిస్తుంది.
ఇక బీ విటమిన్, బీ2 విటమిన్, ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా గర్భం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక ఈ విటమిన్లు లభించే పదార్థాలను స్త్రీలు తినడం అలవాటు చేసుకోవాలి. కోడిమాంసం, చేపలు, బీన్స్, గింజధాన్యాలు, అరటిపండ్లు, ఆకుపచ్చ కూరగాయల్లో బీ, బీ2, ఫోలిక్ యాసిడ్లు దొరుకుతాయి.
ఇక సీ విటమిన్కు పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంపొందించే శక్తి ఉంటుంది. ఈ విటమిన్ కలిగిన పదార్థాలను తీసుకునేవారిలో సంతానప్రాప్తి సమస్యలు ఉండవు. అన్నిరకాల పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, కివీఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి.